బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శాఖమూరులో జిఐజిజి

3 గంటల క్రితం

శాఖమూరులో జిఐజిజి 
- రాజధాని సిగలో మరో కీలక సంస్థ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రాజధాని సిగలో మరో కీలక సంస్థ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: అమరావతి రాజధాని పరిధిలోని ప్రజా గ్రంథాలయం, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్(జిఐజిజి),సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన డిజైన్లను ఇటీవల సిద్ధం చేశారు. సుమారు రూ.597 కోట్ల వ్యయంతో 19.12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థాగత, సాంస్కృతిక, విద్యా ప్రజా-వినియోగ సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సి ఉందని అందులో భాగంగానే అమరావతి సంగమం పేరుతో మూడు సంస్థలనూ ఒకేచోట ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శాఖమూరులో ఏర్పాటు చేసే ఈ సంగమంలో ఎపి రాష్ట్ర ప్రజా గ్రంథాలయం, సాంస్కృతిక కేంద్రం, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్(జిఐజిజి) సంస్థలు మూడు కలిసి ఉంటాయని వివరించారు. దీనికి 'విజ్ఞాన సాంస్కృతిక ప్రాంగణం' గా పేరు పెట్టారు. నూతన రాజధానికి ఒక విశిష్టమైన పౌర సాంస్కృతిక చిహ్నంగా ఇది మారుతుందని చెబుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్