- జాతీయ విపత్తుగా ప్రకటించాలి
- సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ కరువు మండలాల ప్రకటన ప్రజలను, రైతు, కూలీలను తీవ్రంగా నిరాశపరి చిందని, రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో 544 మండలాలను కరువుగా గుర్తించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని, అందుకు తగినట్లుగా ప్యాకేజీ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పరిస్థితికనుగుణంగా కేంద్ర ప్రభుత్వ కరువు మాన్యువల్ 2016ను సవరించాలని కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది ఆరంభం నుండే ఎల్‌నినోతో వర్షాలు పడవని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించిన రాష్ట్రప్రభుత్వం మెల్లగా కళ్లు తెరిచి 388 మండలాలను అందులోనూ 283 మాత్రమే తీవ్ర కరువుగా ప్రకటించడం అన్యాయమని తెలి పారు. అనంతపురం జిల్లాలో 31 గ్రామీణ మండలాలకు గానూ 28 కరువుగా ప్రకటిం చారని, కానీ ప్రకటించని పెద్ద ఒడుగూరు మండలంలో తాను పర్యటించిన సందర్భంగా పంటలన్నీ ఎండిపోవడం ప్రత్యక్షంగా చూశానని, ఇలాంటి మండలాలను మినహా యించరాదని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, పల్నాడు చివరకు గుంటూరు, బాపట్ల, ఎన్‌టిఆర్, కృష్ణా, నెల్లూరు జిల్లాల పశ్చిమ మండలాలు, డెల్టా చివర భూములు కూడా ఎండిపోయాయని పేర్కొన్నారు. పంట వేయని భూములు ఖాళీగా ఉన్నా యని, రైతులు పెట్టుబడి నష్టపోయారని, కూలీలకు ఉపాధి లేదని, తాగేనీరు కరువైందని, పశువులకు గడ్డిలేదని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయమని తెలిపారు. విదేశీ పెట్టుబడుల రందిలో రాష్ట్ర ప్రజలను, గ్రామీణ పేదలు, రైతులను మరిచిపోయారని, ఇప్పటికైనా కళ్లు తెరిచి రాష్ట్రాన్ని కరువు బారి నుండి ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)