అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న క్యాంపు కోర్టు నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు హెచ్ఆర్సీ క్యాంపు కోర్టు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ తెలిపారు. ఈ క్యాంపు కోర్టు నందు ఎన్టీఆర్ జిల్లా కృష్ణాజిల్లా ఏలూరు జిల్లా, (భీమవరం) పశ్చిమగోదావరి జిల్లా లకు సంబంధించిన కేసుల విచారణలతో పాటు నూతన కేసుల స్వీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ క్యాంపు కోర్టు కార్యక్రమాల్లో హెచ్ఆర్సీ పరిధిలోని పెండింగ్ లో ఉన్న కేసులలోని ఆయా జిల్లాల అధికారులు విజయవాడ కేంద్రంగా నిర్వహించబడే ఈ క్యాంపు కోర్టుకి హాజరుకావాలని సూచించారు.
రేపటి నుండి మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టులు ప్రారంభం
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 09, 2026, 05:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)