సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తౌషిక్‌కు న్యాయం చేయాలి

53 నిమిషాల క్రితం

ma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మందకృష్ణ మాదిగ

ఒంగోలు సిటీ : సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కు చెందిన తౌషిక్‌ అనుమానాస్పద మృతి కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో హైకోర్టు ఆదేశాల మేరకు విచారణాధికారిణిగా నియమితులైన నెల్లూరు అడిషనల్‌ ఎస్పీ సౌజన్యను ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆయన కలిశారు. కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను ఆమెకు అందజేశారు. తౌషిక్‌ది ఆత్మహత్య కాదని, హత్యేనని పేర్కొంటూ వార్డెన్‌ ప్రవీణ్‌ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. హైకోర్టు ఆదేశించి ఏడు నెలలు గడుస్తున్నా విచారణలో జాప్యం జరగడంపై అసహనం వ్యక్తం చేశారు. ఘటన కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే జరిగిందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని కోరారు. వారం రోజుల్లో సమగ్ర విచారణ పూర్తి చేసి హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామని అడిషనల్‌ ఎస్పీ హామీ ఇచ్చినట్లు మందకృష్ణ మీడియా కు తెలిపారు. నిందితులను అరెస్టు చేయకుండా బెయిల్‌ పొందేందుకు పోలీసులు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయకుంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్‌కె సైదా, విసికె పార్టీ అధ్యక్షులు ఆదినారాయణ, పీఎల్‌ఓ నాయకురాలు పద్మ, క్రాంతి, తౌషిక్‌ తండ్రి సయ్యద్‌ అలీ, కుటుంబ సభ్యులు పలు ప్రజాసంఘాల నేతలు  పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్