ప్రజాశక్తి - తుళ్లూరు: మిజోరాం ముఖ్యమంత్రి లాల్ దుహోమా సోమవారం రాజధాని అమరావతిలోని జిఎడి టవర్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి, ఆయన బృందానికి సి ఆర్ డి ఎ, ఎడిసిఎల్ అధికారులు అమరావతి మాస్టర్ ప్లాన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అమరావతి నగర నిర్మాణంలో అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలు, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాల గురించి వివరించారు. గత శనివారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అమరావతి రాగా ఒకరోజు అనంతరం మిజోరాం ముఖ్యమంత్రి రావడం విశేషం.
అమరావతిలో మిజోరాం సిఎం లాల్ దుహోమా
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026, 06:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)