ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పిసిసి సమావేశానికి గైర్హాజరైన వారికి నోటీసులు

2 గంటల క్రితం

congress
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 07:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఈ నెల 3న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశానికి గైర్హాజరైన 26 మంది సభ్యులకు ఎపిసిసి క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి పివి మోహన్‌ సమక్షంలో ఎపిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పార్టీకి సంబంధించిన పలు రాజకీయ, సంస్థాగత అంశాలపై సమావేశంలో చర్చించారు. సరైన కారణం లేకుండా సమావేశానికి గైర్హాజరు కావడాన్ని పార్టీ క్రమశిక్షణ పరంగా తీవ్రంగా పరిగణిస్తామని క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు.ఈ నేపథ్యంలో గైర్హాజరైన 26 మంది సభ్యులు తమ గైర్హాజరుకు గల కారణాలను వివరిస్తూ షోకాజ్‌ నోటీసు అందిన 48 గంటల్లోగా రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యాలయానికి లిఖితపూర్వక వివరణ సమర్పించాలని ఆదేశించారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్