ప్రజాశక్తి - గన్నవరం : యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ను నెల్లూరు జైలు నుంచి కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉప చట్టం కింద అరెస్టయి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను విచారించేందుకు వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ గన్నవరం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు శుక్రవారం ఆయనను నెల్లూరు జైలు నుంచి గన్నవరం తీసుకువచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు అనుమతితో శనివారం రెండో రోజు విచారణ కొనసాగింది. స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో డిఎస్‌పి ధర్మేంద్ర, సిఐ శివప్రసాద్ రావణ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. రావణ్ అసలు పేరు ఏమిటి? యూట్యూబ్ ఛానల్‌ను ఎప్పుడు ప్రారంభించారు? ఈ కార్యకలాపాలకు వెనుక ఎవరు ఉండి సహకారం అందిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మాత్రమే రావణ్ సమాధానాలిచ్చి, మిగిలిన విషయాలను చెప్పలేదని సమాచారం.
కొనసాగుతున్న యూ ట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ విచారణ
19 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 12:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)