శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి : కెవిపిఎస్

9 గంటల క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 09:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. విజయవాడ సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో నవంబర్‌ 10 నుంచి 13 వరకు మానవ హక్కుల కమిషన్‌ క్యాంపు కోర్టు నిర్వహణను స్వాగతిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు, పేదలపై జరుగుతున్న వివక్ష, దాడులు, పోలీసుల వేధింపులు, అధికారుల నిర్లక్ష్యం గురించి ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు.క్యాంపు కోర్టును ప్రతి నెలా నిర్వహించాలని, పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. బాధితులు ఆధారాలు, సంబంధిత పత్రాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్