శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెత్త నిర్వహణకు ‘ప్రగతి 50’ కమిటీ..

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 08:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ప్రగతి 50 కింద ఎంపిక చేసిన విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో చెత్త నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. పట్టణాభివృద్దిశాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఉండే ఈ కమిటీలో సభ్యులుగా పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ‌ఎమ్‌‌డి, ఎపిపిసిబి, పబ్లిక్‌ ‌హెల్త్‌ ‌విభాగం నుండి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రస్థాయిలో ఏర్పాటయ్యే ఈ కమిటీ నగరాలకు యాక్షన్ ప్లాన్ల తయారీలో కీలకంగా వ్యవహరిస్తుంది. నిరంతరం పురోగతిని సమీక్షించడంతోపాటు అవసరమైతే నిధుల విడుదలకూ సిఫార్సు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నం, తిరుపతి నగరాలకు నగరస్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. మేయర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌, ఎపిపిసిబి రీజనల్‌ అధికారితోపాటు అవసరమనుకున్న మరొకరిని కూడా సభ్యులుగా తీసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ కమిటీలు చెత్త నిర్వహణ, రీయూజ్డ్‌ ‌వాటర్‌ ‌నిర్వహణకు అవసరమైన విధివిధానాలు రూపొందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రజల పౌరుల భాగస్వామ్య కార్యకలాపాలను రూపొందించాల్సి ఉంటుందని జిఓలో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్