ప్రజాశక్తి - శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : శింగరాయకొండ జాతీయ రహదారి పరిధిలోని రన్‌వేపై రెండు కార్లు ఢీకొనడంతో డివైడర్‌గా పెట్టిన బండరాయి మీద పడి ఇద్దరు స్నేహితులు మృతి చెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ లేళ్ల సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పొన్నలూరు మండలం కొత్త సింగరబొట్లపాలేనికి చెందిన స్నేహితులు కూరపాటి చంద్రశేఖర్ (35), ఇమ్రాన్ తహీర్ (27) కారులో ఒంగోలుకు వెళ్తున్నారు. శింరాయకొండ పరిధిలోని పోలేరమ్మ గుడి సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో కారుడు ఢీకొంది. దీంతో, కారు తిరగబడి బండరాయిని ఢీకొనగా వారిద్దరూ ఆ రాయిపై పడి మృతి చెందారు. కూరపాటి చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరులో విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వివాహమై ఇద్దరు కుమార్తెలున్నారు. ఇమ్రాన్ తహీర్ జియో సిమ్ కార్డుల డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కార్లు ఢీకొని ఇద్దరు మృతి..
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026, 11:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)