ప్రజాశక్తి- నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) : నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల ఫలితం ప్రత్యేక చర్చకు దారితీసింది. టిడిపి నుంచి చైర్మన్ పదవిని ఆశించిన లెంక అప్పలనాయుడుకు కూటమి సీట్ల సర్దుబాటులో అవకాశం దక్కలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. చైర్మన్ ఎన్నికలో బిజెపి అభ్యర్థి మైపాడ ప్రసాద్‌పై స్వతంత్ర అభ్యర్థి లెంక అప్పలనాయుడు విజయం సాధించి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కూటమి సర్దుబాట్లలో భాగంగా బిజెపికి అవకాశం కల్పించినప్పటికీ, ఆ పార్టీ అభ్యర్థి గెలవకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కూటమిలోని పార్టీల మధ్య సర్దుబాట్లపై స్థానికంగా నెలకొన్న అసంతృప్తి ఈ ఫలితంలో ప్రతిబింబించిందనే చర్చ సాగుతోంది.
నెల్లిమర్లలో బిజెపికి ఎదురుదెబ్బ
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026, 02:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)