బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నెమ్మదిగా కదులుతున్న అక్వాన్ తుపాను

10 గంటల క్రితం

ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 07:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన!

అమరావతి: అక్వాన్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం, విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. తుపాను పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ ఇవాళ ఉదయానికి తీవ్ర తుపానుగా, రేపు సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచవచ్చని హెచ్చరించారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కోస్తా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్