ప్రజాశక్తి-యంత్రాంగం : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం శివారులోని కొండాలమ్మ గుడి సమీపంలో ఎర్ర కాలువకు గండి పడింది. వరుస తుపాన్లతో నీటిమట్టం భారీ పెరగడం, ప్రవాహ ఉధృతి వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. కాలువ నీరు ముంచెత్తడంతో నిడదవోలు మండలంలోని తాళ్లపాలెం, సింగవర గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరింది. కంసాలిపాలెం, రావిమెట్ల, సింగవరం, తాళ్లపాలెం, తిమ్మరాజుపాలెం, రావిమెట్ల, కోరుమామిడిలోని వరి, ఇతర పంటలు నీటి మునిగాయి. ఎర్ర కాల్వ ఉగ్రరూపంతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని నందమూరు, జగన్నాథపురం, మారంపల్లి గ్రామాల్లోకి వరద భారీగా చేరింది. నందమూరు గ్రామస్తులు పునరావాస కేంద్రానికి వరద నీటిలో తరలివెళ్లారు. భీమవరం పట్టణానికి వరద ముంపు ప్రమాదం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నీట మునిగిన గ్రామాలు, పంటలు
06 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026, 08:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)