ప్రజాశక్తి - ఎస్.రాయవరం (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామ సమీపానగల వరాహ నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు శనివారం గల్లంతయ్యారు. ఎస్‌ఐ లొడ్డు రామకృష్ణ కథనం మేరకు.. పెనుగొల్లు గ్రామానికి చెందిన ముప్పిడి వంశీ, కోడి గణేష్, కాతేటి రిషి మరో ముగ్గురితో కలిసి పెనుగొల్లు గ్రోయిన్ వద్ద స్నానానికి దిగారు. వంశీ, గణేష్, రిషిలకు ఈత రాకపోవడంతో నది ఉధృతికి కొట్టుకుపోయారు. గ్రోయిన్ కింద గుంతలోకి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. వారితో ఉన్న యువకులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెనుగొల్లు దళిత కాలనీ చెందిన ఆ ముగ్గురు యువకులు ఒకేసారి గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వరాహ నదిలో ముగ్గురు యువకులు గల్లంతు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026, 11:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)