ప్రజాశక్తి - కడప అర్బన్ : వైఎస్‌ఆర్ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మూడు ప్రాంతాలలో తొమ్మిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్‌పి నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాలను ఎస్‌పి పరిశీలించారు. బుధవారం ఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలోని మన్నూరు, వీరబల్లి, ఖాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 87 ఎర్రచందనం దుంగలను, ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్మగ్లర్లు మురళి, మనోహర్, సునీల్ కుమార్, సయ్యద్ షాబుద్దీన్, శ్రీనివాసులు, నాగేంద్ర, సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్య, చంద్రను అరెస్టు చేసినట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)