అమరావతి : నామినేషన్ల వేళ ... రాష్ట్రంలో శనివారం కూడా పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వైసిపి, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ రాజుకుంది. ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలవ్వగా, ఓ కారు ధ్వంసమయ్యింది. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ... కడప నగరంలోని పలు నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగితాలపెంట నామినేషన్ కేంద్రం వద్ద టిడిపి, వైసిపి వర్గీయులు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మరియాపురం నామినేషన్ సెంటర్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గాంధీనగర్ పాఠశాల వద్ద టిడిపి, వైసిపి కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. నాగరాజుపేట, సెయింట్ జోసెఫ్ నామినేషన్ కేంద్రాల వద్ద ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.
నామినేషన్ల వేళ .. రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 01:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు





కామెంట్లు (0)