సర్పంచ్ పదవుల్లో మహిళలకు 9 స్థానాలు
ప్రజాశక్తి – కొయ్యలగూడెం (ఏలూరు) : ప్రస్తుత గెజిట్ ప్రకారం కొయ్యలగూడెం మండలంలోని 18 గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 18 గ్రామపంచాయతీల్లో 208 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవులకు సంబంధించి మహిళలకు 9 స్థానాలు కేటాయించారు. మిగిలిన స్థానాలను వివిధ సామాజిక వర్గాలకు రిజర్వు చేశారు. గ్రామపంచాయతీల వార్డుల సంఖ్య, వాటికి కేటాయించిన రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. అచ్యుతపురం: మొత్తం 10 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవి బీసీకి కేటాయించారు. 1, 3వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 2, 4, 7వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 5వ వార్డు ఎస్సీకి, 6వ వార్డు ఎస్సీ మహిళకు, 8వ వార్డు బీసీ మహిళకు, 9, 10వ వార్డులు బీసీలకు కేటాయించారు.
బయ్యనగూడెం: మొత్తం 14 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవి అన్‌రిజర్వుడ్‌గా ఖరారైంది. 1వ వార్డు ఎస్సీ మహిళకు, 2వ వార్డు బీసీ మహిళకు, 3, 10, 12, 13వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 4, 5వ వార్డులు ఎస్సీలకు, 6, 8, 9, 11వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 7వ వార్డు బీసీకి, 14వ వార్డు బీసీ మహిళకు కేటాయించారు. బొడిగూడెం: మొత్తం 14 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ పదవి అన్‌రిజర్వుడ్‌గా కేటాయించారు. 1, 3వ వార్డులు బీసీ మహిళలకు, 2, 7, 10, 11వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 4వ వార్డు ఎస్సీ మహిళకు, 5, 8, 14వ వార్డులు బీసీలకు, 6వ వార్డు ఎస్సీకి, 9, 12, 13వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా కేటాయించారు. దిప్పకాయలపాడు: మొత్తం 14 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వు అయింది. 1, 3, 4, 5వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 2వ వార్డు ఎస్టీ మహిళకు, 6వ వార్డు బీసీకి, 7వ వార్డు బీసీ మహిళకు, 8, 9వ వార్డులు ఎస్సీలకు, 10, 12, 14వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 11వ వార్డు ఎస్సీ మహిళకు, 13వ వార్డు ఎస్టీకి కేటాయించారు. కన్నాపురం: మొత్తం 14 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ పదవి అన్‌రిజర్వుడ్‌గా ఖరారైంది. 1, 3వ వార్డులు బీసీ మహిళలకు, 2, 6, 11, 13వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 4, 5వ వార్డులు బీసీలకు, 7, 8వ వార్డులు ఎస్సీలకు, 9వ వార్డు ఎస్సీ మహిళకు, 10, 12, 14వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా కేటాయించారు. కుంతలగూడెం: మొత్తం 8 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. 1వ వార్డు ఎస్సీ మహిళకు, 2వ వార్డు ఎస్సీకి, 3, 5వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 4, 7వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 6వ వార్డు బీసీ మహిళకు, 8వ వార్డు బీసీకి కేటాయించారు. మంగపతిదేవిపేట: మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. 1వ వార్డు బీసీ మహిళకు, 2, 9వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 3, 4, 10వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 5, 6వ వార్డులు బీసీలకు, 7వ వార్డు ఎస్సీ మహిళకు, 8వ వార్డు ఎస్సీకి కేటాయించారు. నరసన్నపాలెం: మొత్తం 8 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవి ఎస్సీకి కేటాయించారు. 1, 4వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 2వ వార్డు ఎస్సీకి, 3వ వార్డు ఎస్సీ మహిళకు, 5, 6వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 7వ వార్డు బీసీకి, 8వ వార్డు బీసీ మహిళకు కేటాయించారు. పరింపూడి: మొత్తం 16 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయింది. 1వ వార్డు ఎస్టీకి, 2, 6వ వార్డులు ఎస్సీ మహిళలకు, 3, 4వ వార్డులు ఎస్సీలకు, 5, 12, 13, 14వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 7, 9, 10, 16వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 8, 11వ వార్డులు బీసీ మహిళలకు, 15వ వార్డు బీసీకి కేటాయించారు.
పొంగుటూరు: మొత్తం 12 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవి అన్‌రిజర్వుడ్ మహిళకు కేటాయించారు. 1, 2, 6, 12వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 3, 4, 5, 10వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 7వ వార్డు బీసీ మహిళకు, 8వ వార్డు ఎస్సీ మహిళకు, 9వ వార్డు ఎస్సీకి, 11వ వార్డు బీసీకి కేటాయించారు.
రాజవరం: మొత్తం 14 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ పదవి అన్‌రిజర్వుడ్ మహిళకు కేటాయించారు. 1వ వార్డు బీసీ మహిళకు, 2వ వార్డు బీసీకి, 3, 11వ వార్డులు ఎస్సీ మహిళలకు, 4, 7, 9, 14వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 5, 10, 12వ వార్డులు ఎస్సీలకు, 6, 8, 13వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా కేటాయించారు.
రామానుజపురం: మొత్తం 10 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవి అన్‌రిజర్వుడ్ మహిళకు కేటాయించారు. 1, 2, 9వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 3, 4, 10వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 5వ వార్డు బీసీ మహిళకు, 6వ వార్డు బీసీకి, 7వ వార్డు ఎస్సీకి, 8వ వార్డు ఎస్సీ మహిళకు కేటాయించారు. సరిపల్లి: మొత్తం 12 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ పదవి ఎస్టీకి కేటాయించారు. 1, 6, 8వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 2, 5, 12వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 3, 11వ వార్డులు ఎస్సీలకు, 4వ వార్డు ఎస్టీకి, 7వ వార్డు ఎస్సీ మహిళకు, 9వ వార్డు బీసీ మహిళకు, 10వ వార్డు ఎస్టీ మహిళకు కేటాయించారు. సీతంపేట: మొత్తం 10 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవి అన్‌రిజర్వుడ్‌గా ఖరారైంది. 1, 4, 9వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 2వ వార్డు బీసీ మహిళకు, 3, 7, 8, 10వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 5వ వార్డు ఎస్సీకి, 6వ వార్డు బీసీకి కేటాయించారు. వేదాంతపురం: మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. 1, 10వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 2వ వార్డు ఎస్సీకి, 3వ వార్డు ఎస్సీ మహిళకు, 4, 5, 6వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 7, 8వ వార్డులు బీసీలకు, 9వ వార్డు బీసీ మహిళకు కేటాయించారు.
ఎర్రంపేట: మొత్తం 12 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవి అన్‌రిజర్వుడ్ మహిళకు కేటాయించారు. 1, 2, 12వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 3, 9వ వార్డులు ఎస్సీలకు, 4వ వార్డు బీసీ మహిళకు, 5, 10వ వార్డులు ఎస్సీ మహిళలకు, 6, 8, 11వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 7వ వార్డు బీసీకి కేటాయించారు.
గవరవరం: మొత్తం 12 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. 1, 5, 9వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 2, 10, 12వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 3, 6వ వార్డులు ఎస్సీలకు, 4వ వార్డు ఎస్సీ మహిళకు, 7, 8వ వార్డులు ఎస్సీ మహిళలకు, 11వ వార్డు బీసీకి కేటాయించారు. చొప్పరమన్నగూడెం: మొత్తం 8 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవి అన్‌రిజర్వుడ్‌గా ఖరారైంది. 1, 8వ వార్డులు అన్‌రిజర్వుడ్ మహిళలకు, 2, 4వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా, 3వ వార్డు బీసీకి, 5వ వార్డు ఎస్సీకి, 6, 7వ వార్డులు ఎస్సీ మహిళలకు కేటాయించారు.
2021 రిజర్వేషన్లే కొనసాగింపు ...
గవరవరం, చొప్పరమన్నగూడెం గ్రామపంచాయతీలకు సంబంధించి 2021లో జరిగిన మొదటి విడత సాధారణ ఎన్నికల సమయంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు అమలుకాలేదు. ఈ నేపథ్యంలో 2026 అక్టోబర్ 27న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన ప్రత్యేక ఉత్తర్వుల్లో గతంలో కేటాయించిన రిజర్వేషన్లను ప్రస్తుత ఎన్నికలకు కొనసాగించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 2020 మార్చి 9న విడుదలైన వెస్ట్ గోదావరి జిల్లా గెజిట్ నంబర్ 461/2020ను ఆధారంగా తీసుకున్నారు. దీంతో ఈ రెండు గ్రామపంచాయతీల రిజర్వేషన్లను కూడా కలిపి కొయ్యలగూడెం మండలంలోని మొత్తం 18 గ్రామపంచాయతీల రిజర్వేషన్ల వివరాలు పూర్తయ్యాయి.








కామెంట్లు (0)