mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలియో మహమ్మారిని తరిమికొట్టాలి : ఎమ్మెల్యే వరుపులసత్యప్రభ

1 గంట క్రితం

satya pradha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 01:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ప్రత్తిపాడు (కాకినాడ): పోలియో మహమ్మారిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే వరుపులసత్యప్రభ అన్నారు. ఆదివారం ఉత్తరకంచిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియో లాంటి ప్రమాదకర వ్యాధుల నుంచి చిన్నారులు రక్షించేందుకు ఈ కార్యక్రమం కీలకమన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం ఎంతో దోహా దపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ యశస్వి, ఇళ్ల అప్పారావు, హెల్త్ సూపర్వైజర్ రామిశెట్టి రాంబాబు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్