ప్రజాశక్తి-చిలకలూరిపేట:హైకోర్టు విధించిన షరతులకు అనుగుణంగా మాజీ మంత్రి విడుదల రజిని ఆదివారం చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు హాజరై, పోలీస్ రికార్డు బుక్‌లో సంతకం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి గౌరవం ఉందని, అందుకే కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని తెలిపారు. తమపై నమోదైన కేసులు రాజకీయ కక్షసాధింపులో భాగంగా పెట్టిన అక్రమ కేసులేనని, త్వరలోనే నిజం తప్పకుండా వెలుగులోకి వస్తుందనే విశ్వాసం ఉందన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తామని, చివరికి న్యాయమే గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా, మాజీ మంత్రికి సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా అర్బన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
చిలకలూరిపేట అర్బన్ పీఎస్‌లో సంతకం చేసిన విడుదల రజిని
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 28, 2026, 01:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)