mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫిఫా చరిత్రలో ఆఫ్రికా జోరు.. నాకౌట్‌లోకి ఏకంగా 9 దేశాలు !

1 గంట క్రితం

Africa's surge in FIFA history... a remarkable 9 nations into the knockouts!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 12:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఫిఫా : ఫిఫా ప్రపంచకప్-2026లో ఆఫ్రికా దేశాలు చరిత్రాత్మక ప్రదర్శనతో కొత్త మైలురాయిని నెలకొల్పాయి. ఈసారి టోర్నీలో ఆఫ్రికా నుంచి 10 జట్లు బరిలోకి దిగగా, వాటిలో ఏకంగా 9 జట్లు రౌండ్ ఆఫ్ 32 (నాకౌట్)కు అర్హత సాధించడం విశేషం. ఆదివారం జరిగిన మ్యాచ్‌లలో కాంగో 3-1 తేడాతో ఉజ్బెకిస్తాన్‌ను ఓడించగా, అల్జీరియా–ఆస్ట్రియా మధ్య పోరు 3-3తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితాలతో మొరాకో, దక్షిణాఫ్రికా, సెనెగల్, ఐవరీ కోస్ట్, ఘనా, కేప్ వెర్డె, ఈజిప్ట్, కాంగో, అల్జీరియా జట్లు నాకౌట్‌కు చేరి ఫిఫా చరిత్రలో అరుదైన ఘట్టాన్ని సృష్టించాయి.


ఇంతకుముందు ఒకే ప్రపంచకప్‌లో ఆఫ్రికా నుంచి అత్యధికంగా ఆరు జట్లు మాత్రమే నాకౌట్ దశకు చేరాయి. ఆ రికార్డు 2014, 2022 ప్రపంచకప్‌లలో నమోదైంది. అయితే ఈసారి ఆ సంఖ్యను ఏకంగా తొమ్మిదికి పెంచుతూ ఆఫ్రికా జట్లు తమ ఆధిపత్యాన్ని చాటాయి. ప్రత్యేకంగా కేప్ వెర్డె, కాంగో వంటి చిన్న జట్లు కూడా నాకౌట్‌కు చేరడం ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఆఫ్రికా బలం ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తోంది. మరోవైపు ఆసియా ఫుట్‌బాల్‌లో బలమైన జట్టుగా పేరున్న ఇరాన్ మాత్రం లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2022 ఖతార్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికా దేశంగా మొరాకో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తున్న మొరాకో, బలమైన బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుని తన సత్తా చాటింది. దీంతో మరోసారి సెమీఫైనల్ చేరే అవకాశాలు ఆ జట్టుకు బాగానే కనిపిస్తున్నాయి. 2030 ఫిఫా ప్రపంచకప్‌కు మొరాకో సహ-ఆతిథ్య దేశంగా ఉండనుండగా, ప్రస్తుత టోర్నీలో మాత్రం నాకౌట్ దశలో కేప్ వెర్డె డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో, కాంగో మాజీ ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. లీగ్ దశలో సంచలన ప్రదర్శన చేసిన ఈ రెండు జట్లు నాకౌట్‌లో కూడా అదే జోరును కొనసాగిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్