మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అలా అంటారని మౌనంగా ఉన్నా : రేణూ దేశాయ్‌

4 గంటల క్రితం

It is not correct to say that I lack a distinct identity Renu Desai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 08:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : దీపావళి వేడుకల పేరుతో అర్ధరాత్రి దాటినా భారీ శబ్దాలతో టపాసులు కాల్చడంపై సినీనటి రేణూదేశాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏమైనా మాట్లాడితే హిందూ వ్యతిరేకి అని అంటారని అందుకే మౌనంగా ఉన్నానని అన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇబ్బందులను గుర్తించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా రేణూ దేశాయ్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ''రాత్రి 11 గంటలవుతోంది. అయినా ప్రజలు ఇంకా ఇంత పెద్ద శబ్దం వచ్చే టపాసులు కాలుస్తూనే ఉన్నారు. దీపావళి రోజు ఏదైనా మాట్లాడి ఉంటే నన్ను హిందూ వ్యతిరేకి అనేవారు. అందుకే ఆ రోజు మౌనంగా ఉండిపోయాను. కానీ దీపావళి అయిపోయినా కూడా 11 గంటలకు ఇంత పెద్ద శబ్దాలతో టపాసులు కాల్చడానికి ఏ పండుగ ఉంది ?. ఇతరుల బాధలను పట్టించుకోకుండా మన ఆనందమే ముఖ్యమనుకుంటున్నారు. ఇది కేవలం మూర్ఖత్వం, ఎదుటివారి పట్ల కనీస సానుభూతి లేకపోవడమే’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీరు దీపాల పండుగను ఆనందంగా చేసుకోండి తప్పులేదు. కానీ, దాన్ని శబ్దాల పోటీగా మార్చకండి. వీలైనంత వరకు రాత్రి 10 గంటల్లోపే టపాసులు కాల్చడం ముగించండి. ఆ తర్వాతైనా జనాలను ప్రశాంతంగా ఉండనివ్వండి. తోటి మనుషుల పట్ల కొంచెం దయ చూపించండి. మీ ఆనందం కోసం ఇతరులను హింసించకండి’’ అని రేణు దేశాయ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేకాకుండా.. కాలుష్యం గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదని, ఏడాదిలో 364 రోజుల పాటు వాహనాలు, పరిశ్రమల వల్ల కాలుష్యం ఉంటోందని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్