శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాకు ప్రత్యేక గుర్తింపు లేదనడం సరికాదు : రేణు దేశాయ్‌

1 గంట క్రితం

It is not correct to say that I lack a distinct identity Renu Desai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 01:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : సినీనటి రేణు దేశాయ్‌ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలు, సోషల్‌ మీడియా ట్రోలింగ్‌పై ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్యగానే గుర్తించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా రేణు దేశాయ్‌ మాట్లాడుతూ ... ‘బద్రి’ సినిమాతోనే తన జీవితం ప్రారంభమైందని చాలామంది భావిస్తున్నారని, అంతకుముందు తనకంటూ ఓ జీవితం ఉందనే విషయాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. విడాకులు జరిగి 14 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తుచేస్తూ.. శ్రీరాముడు సైతం 14 ఏళ్లే వనవాసం చేశారని, మరి తన వనవాసం ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించారు.


విడాకుల అనంతరం తాను సాధించిన విజయాలను కూడా ఆమె ప్రస్తావించారు. 2012లో విడాకులు మంజూరైన తర్వాత మరాఠీ చిత్రాన్ని నిర్మించగా అది విజయవంతమైందని తెలిపారు. మరో సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించానని చెప్పారు. డ్యాన్స్‌ షో లకు పనిచేశానని, కవితలు రాశానని, ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తున్నానని వివరించారు. ఇన్ని రంగాల్లో పనిచేస్తూ అవకాశాలు పొందుతున్న తనకు ప్రత్యేక గుర్తింపు లేదనడం సరికాదని అభిప్రాయపడ్డారు.


సోషల్‌ మీడియాలో ఎదురవుతున్న ట్రోలింగ్‌పైనా ఆమె స్పందించారు. కుక్కను కాపాడినా విమర్శలు చేస్తున్నారని, పవన్‌ కల్యాణ్‌ లేకపోతే తాను జీవించడానికి కూడా అర్హురాలిని కాదన్నట్లుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేణు దేశాయ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్