శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

త్రిగుణ్‌ ‘జంగా’ గ్లింప్స్‌

10 గంటల క్రితం

త్రిగుణ్‌ ‘జంగా’ గ్లింప్స్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 07:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘జంగా’. కెవిన్ గడ్డం (శ్రీహరి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో బిగ్‌ ‌బాస్‌ 10 ‌కంటెస్టెంట్‌ త్రిగుణ్ ‌హీరోగా చేస్తున్నారు. నేహా పఠాన్ హీరోయిన్‌ ‌గా కనిపించనున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, చందు గౌడ, సమీర్, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కొన్ని లక్షల ఏండ్లు పట్టింది.. పశువు మనిషి అవ్వడానికి.. మళ్లీ పశువు అవుతానంటే నేను ఒప్పుకోను.. మనిషి పశువు అయితే.. మరణం వథమ్‌ అయితాది’ అంటూ త్రిగుణ్ చెప్పిన డైలాగ్స్ తో ఈ గ్లింప్స్‌ ‌ను కట్ చేశారు. మానవ భావోద్వేగాలు, పుట్టుక-చావుల మధ్య ఉండే సంక్లిష్టతలు స్పృశిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. వెంకట్ సి. దిలీప్ కెమెరామెన్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్