నటి కీర్తి సురేష్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ ‘అక్క’ ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇందులో తాను పోషించిన ‘భవాని’ పాత్ర ఇప్పటివరకు చేసిన పాత్రల్లో అత్యంత ప్రత్యేకమైనదని చెప్పారు. కథలోని వైవిధ్యమే ఈ సిరీస్‌లో నటించడానికి ప్రధాన కారణమని తెలిపారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ భవాని పాత్రలోని విభిన్న కోణాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నారు. నటి రాధిక ఆప్టేతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, ఈ సిరీస్ ద్వారా తొలిసారిగా నెట్‌ఫ్లిక్స్, వైఆర్‌ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ సిరీస్ అందుకే చేశా : కీర్తి సురేష్
26 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)