హీరో అనీష్, అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోన్న తాజా చిత్రం 'ఇట్లు అర్జున`. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌పై దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించారు. అగ్ర నటుడు నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ మూవీ ట్రైలర్ ను హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా విడుదల చేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ‘‘అనీష్.. ఇలాంటి పాత్రను తొలి సినిమాకే ఎంచుకున్నావంటే కథను ఎంత బలంగా నమ్ముతున్నావో అర్థమవుతోంది. మీకు అద్భుతమైన ఆరంభం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిత్ర బృందానికి శుభాభినందనలు’’ అని ఎన్టీఆర్ పోస్టులో పేర్కొన్నారు.
Print Edition13న రానున్న ‘ఇట్లు అర్జున’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026, 08:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)