శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయి పల్లవి, ధనుష్‌, మమ్ముట్టి పవర్‌ఫుల్‌ యాక్షన్‌.. ‘O.M’ ట్రైలర్‌ విడుదల..

6 రోజుల క్రితం

om.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 12:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘O.M’ (ఆపరేషన్‌ మోల్‌) చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. తిరుమల శ్రీవారి సుప్రభాతంతో ప్రారంభమైన ట్రైలర్‌.. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌ చీకటి కోణాలను ఆవిష్కరించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రాయలసీమ నుంచి తమిళనాడు సరిహద్దుల వరకు విస్తరించిన స్మగ్లింగ్‌ మాఫియా నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. పేదరికం, అక్రమ వ్యాపారాలు, అధికారం మధ్య జరిగే సంఘర్షణతో పాటు భావోద్వేగాలకు కూడా చిత్రంలో ప్రాధాన్యత ఇచ్చినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.

ఈ చిత్రంలో ధనుష్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారిగా, సాయి పల్లవి ఐపీఎస్‌ అధికారిణిగా నటిస్తున్నారు. అమరన్‌ ఫేమ్‌ రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి ఐపీఎస్‌ అధికారిణి నిత్యారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఆమె చేసిన యాక్షన్‌ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ధనుష్‌, మమ్ముట్టి పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. మమ్ముట్టి బర్మా కార్తికేయన్‌ పాత్రలో కనిపించనుండగా, శ్రీలీల, నసీరుద్దీన్‌ షా, రేణూ దేశాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్‌ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో తొలుత అనుకున్న ‘OM’ టైటిల్‌ను ‘O.M’ (Operation Mole)గా మార్చినట్లు సమాచారం. సాయి అభ్యంకర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వండర్‌బార్‌ ఫిల్మ్స్‌, ఆర్‌ టేక్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్