‘35 చిన్న కథ కాదు’ చిత్రంతో నటుడిగా మెప్పించిన విశ్వదేవ్ తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారు. యువ దర్శకుడు నర్సి రాజగిరి సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శ్రీ తులసి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ నంబర్ 1గా చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ‘ముఖచిత్రం’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంగాధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
విశ్వదేవ్ కొత్త సినిమా
24 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 07:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)