సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం

2 రోజుల క్రితం

asia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 12:31 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఫ్లాగ్‌ బేరర్లుగా మను, తేజిందర్‌

- మహిళల క్రికెట్‌లో సెమీస్‌కు భారత్‌

నగోయా (జపాన్‌): 20వ ఆసియా క్రీడలు జపాన్‌లోని నగోయా వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రారంభోత్సవ వేడుకల్లో భారత ఫ్లాగ్‌ బేరర్లుగా ఒలింపిక్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్‌తోపాటు ఆసియా క్రీడల షాట్‌పుట్‌ ఛాంపియన్‌ తేజిందర్‌ పాల్‌ తూర్‌ వ్యవహరించనున్నారు. చెఫ్‌-డె-మిషన్‌ సహదేవ్‌ యాదవ్‌ చివరి నిమిషంలో ఫ్లాగ్‌ బేరర్ల పేర్లను ఖరారు చేశారు. అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా తేజిందర్‌ పాల్‌ పేరును నామినేట్‌ చేయగా.. భారత రైఫిల్‌ అసోసియేషన్‌ మను బకర్‌ పేరును ప్రతిపాదించాయి. 2022లో చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన 19వ ఆసియా క్రీడల్లో భారత్‌ (106) సెంచరీ పతకాలతో సత్తా చాటి పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలువగా.. ఈసారి టాప్‌-3పై కన్నేసింది. 503 అథ్లెట్లతో ఆసియా క్రీడలకు బయల్దేరిన భారత బృందం అత్యధిక పతకాల సాధనతో బరిలోకి దిగుతోంది. శుక్రవారం జరిగిన మహిళల క్రికెట్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారతజట్టు 8 వికెట్ల తేడాతో జపాన్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. ఇక టెక్‌బాల్‌లో క్విన్సీ గ్రూప్-ఏ ప్రారంభ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన యుయినా సకమోటోను 10-11, 12-11, 13-11తో, కంబోడియాకు చెందిన కోమ్‌యాన్ డివైపై 12-9, 12-7తో విజయం సాధించి సెమీస్‌కు చేరారు.

మహిళల క్రికెట్‌లో సెమీస్‌కు భారత్‌

మహిళల క్రికెట్‌ సెమీఫైనల్లోకి భారత మహిళలజట్టు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన నాల్గో, చివరి క్వార్టర్‌ ఫైనల్లో భారతజట్టు 8వికెట్ల తేడాతో ఆతిథ్య జపాన్‌పై విజయం సాధించింది. జపాన్‌ నిర్దేశించిన 58పరుగులను భారత్‌ కేవలం 5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కమిలిని(0), ఫుల్మాలీ(6) నిరాశపరిచినా.. షెఫాలీ వర్మ(40), రీచా ఘోష్‌(12) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు జపాన్‌ను తెలుగు తేజం శ్రీచరణి(4/10) తన స్పిన్‌ మాయాజాలంతో కట్టడి చేసింది. షెఫాలీ వర్మ(2/13)కి తోడు శ్రేయాంక పాటిల్‌, దీప్తి శర్మ ఒక్కో వికెట్‌తో రాణించడం జపాన్‌ జట్టు 19.5ఓవర్లలో 57పరుగులకే ఆలౌటైంది. మూడో క్వార్టర్‌ ఫైనల్లో శ్రీలంక మహిళలు 86పరుగుల తేడాతో మలేషియాపై విజయం సాధించి సెమీస్‌కు చేరారు. శ్రీలంక జట్టు 4వికకెట్ల నష్టానికి 160పరుగులు చేస్తే.. అనంతరం మలేషియా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 74పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్‌ ఛమీరా ఆటపట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. ఆదివారం జరిగే తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌ మహిళలతో శ్రీలంక, రెండో సెమీస్‌లో బంగ్లాదేశ్‌ మహిళలతో భారతజట్టు తలపడను న్నాయి. 22న నిర్ణయాత్మక పతక మ్యాచ్‌లు జరగనున్నాయి.

జాతీయ గీతం ఆలపనలో తప్పిదాలు...

​దక్ష‍ిణ కొరియా-బంగ్లాదేశ్‌ పురుషుల హాకీ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపనల తప్పిదాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం తొలిరోజు‌ మ్యాచ్‌ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. పూల్‌-ఎలో భాగంగా దక్ష‍ిణ కొరియా జట్టు బంగ్లాదేశ్‌తో తలపడగా.. ఆటగాళ్లు నిల్చున్న క్రమంలో బంగ్లాదేశ్‌ జాతీయ గీతం తర్వాత ఉత్తర కొరియా జాతీయ గీతం ప్రసారమైంది. దీంతో ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురి కాగా.. అర్ధాంతరంగా ఆ గేయాన్ని నిలిపివేసి పరస్పరం కరచాలనం అనంతరం మ్యాచ్‌ ప్రారంభమైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్