- నేడు బంగ్లాదేశ్ మహిళలతో ఆసియాకప్ సెమీస్ మ్యాచ్
- రాత్రి 8.00గం.లకు
దుబాయ్: మహిళల ఆసియా కప్ 2026లో హర్మన్‌ప్రీత్ సేన కీలకపోరుకు సిద్ధమైంది. గ్రూప్ దశలో వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి టాప్‌లో నిలిచిన భారత మహిళలజట్టు గ్రూప్-బిలో 2వ స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ మహిళలతో కీలక సెమీస్ మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ ఇంటర్నేష నల్ స్టేడియంలో గురువారం జరిగే తొలి సెమీ ఫైనల్లో భారతజట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, మంధాన, ప్రతిక రావల్, దీప్తి శర్మ బ్యాటింగ్‌లో రాణిస్తుండగా.. బౌలింగ్‌లో తెలుగు తేజం శ్రీచరణి అంచనాలకు మించి రాణిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్ మహిళలతో జరిగిన కీలక పోరులో శ్రీచరణి కేవలం 7పరుగులిచ్చి 3వికెట్లు పడగొట్టి కెరీర్ బెస్ట బౌలింగ్ నమోదు చేసింది. మరోవైపు యూఏఈపై ఉత్కంఠ విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి సెమీస్ అర్హత సాధించింది. నిగార్ సుల్తానా సారథ్యంలోని బంగ్లాదేశ్ జట్టు గ్రూప్-బిలో యుఎఇ, ఇండోనేషియాలపై గెలిచి శ్రీలంక మహిళల చేతిలో ఓటమిపాలైంది. టోర్నీ పొడవునా అజేయంగా నిలిచిన హర్మన్‌ప్రీత్ సేన ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్ 11న శుక్రవారం జరగనుంది. గ్రూప్-బి టాపర్ శ్రీలంక, గ్రూప్-ఎ లో రెండో స్థానంలో నిలిచిన పాకిస్థాన్ జట్లు ఈ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగానే జరగనుంది. ఈ రెండు సెమీఫైనల్స్‌లో విజేతలుగా నిలిచిన జట్లు సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్లో ఆసియా కప్ ట్రోఫీ కోసం పోరాడతాయి.
జట్లు(అంచనా)...
భారత మహిళలు: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), షెఫాలీ వర్మ, మంధాన, రీచా ఘోష్(వికెట్ కీపర్), ప్రతికా రావల్, భారతి ఫుల్మాలీ, దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీచరణి, క్రాంతి గాడ్, నందిని శర్మ/రేణుకా సింగ్.
బంగ్లాదేశ్ మహిళలు: నిగర్ సుల్తానా(కెప్టెన్, వికెట్ కీపర్), దిలారా అక్తర్, ఫిర్దోస్, శోభన, షర్మిన్ అక్తర్, షోర్నా అక్తర్, ఫాతిమా ఖాతున్, నహిదా అక్తర్, రుబయా ఖాన్, సుల్తానా ఖాతున్, మరుఫా అక్తర్.








కామెంట్‌లు (0)