20వ ఆసియా క్రీడల్లో మూడోరోజు భారత్‌కు నాలుగు పతకాలు దక్కాయి. రెండోరోజు 2 పతకాలకే పరిమితమైనా.. సోమవారం షూటింగ్‌లో మూడు పతకాలు లభించగా.. ఎంఎంఏలో మరో కాంస్య పతకం లభించింది. స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజన్ ఫైనల్‌కు చేరగా.. పురుషుల బ్యాడ్మింటన్‌లో బంగ్లాదేశ్ ను 3-0తో ఓడించి భారతజట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్‌లో హిమాన్షు దిల్లాన్ రజత, రుద్రాంక్ష పాటిల్ కాంస్యం సాధించగా.. టీం విభాగంలో రుద్రాంక్ష, దిల్లాన్, పార్థ్ మనే మరో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఐచి-నగోయా(జపాన్): ఆసియా క్రీడల్లో షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం భారత షూటర్లు మరో మూడు పతకాలను సాధించారు. 10మీ. ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు లభించగా.. టీమ్ విభాగంలో మరో పతకం లభించింది. స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజన్ ఫైనల్‌కు చేరగా.. పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. సోమవారం జరిగిన పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ ఫైనల్లో హిమాన్షు దిల్లాన్ రజత పతకాన్ని, రుద్రాంక్ష పాటిల్ కాంస్య పతకాన్ని సాధించారు. 10మీ. ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రుద్రాంక్ష, పార్థ్ మానే, దిల్లాన్ బృందం 1890.1 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. మహిళల టేబుల్ టెన్నిస్‌లో భారతజట్టు పాకిస్థాన్‌పై గెలిచి ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది.
కబడ్డీలో శుభారంభం
కబడ్డీలో భారత పురుష, మహిళా జట్లు శుభారంభం చేసాయి. సోమవారం జరిగిన గ్రూప్-ఎలో భారత్ 49-24 పాయింట్ల తేడాతో ఆతిథ్య జపాన్‌ను ఓడించింది. ఎనిమిది సార్లు కబడ్డీ చాంపియన్ భారత్ తొలి అర్ధభాగం ముగిసేసరికే 31-9 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ 40-12తో దూకుడు కనబరిచింది. రెండో గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో భారతజట్టు రిపబ్లిక్ ఆఫ్ కొరియాతో తలపడనుంది. మహిళల విభాగంలో భారత్ 35-28తో చైనీస్ తైపీపై విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసేసరికి 20-16పాయింట్లతో ఉంది.
పురుషుల బ్యాడ్మింటన్ క్వార్టర్స్‌కు...
బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో భారతజట్టు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారతజట్టు 3-0తో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లఓ లక్ష్యసేన్ 21-4, 21-12తో జమాన్ అయ్‌మన్‌పై, రెండో సింగిల్స్‌లఓ ఆయుశ్ శెట్టి 21-4, 21-13తో గౌరబ్ సింఘాపై, చివరి మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-15, 21-9తో జుమర్ అల్ అమిన్‌పై విజయం సాధించారు. మంగళవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో భారత పురుషుల జపాన్ జట్టుతో తలపడనుంది.
10మీ. ఎయిర్ రైఫిల్‌లో రజతం - రుద్రాంక్షకు కాంస్యం
ఎంఎంఏలో తారియల్‌కు పతకం 20వ ఆసియా క్రీడలు
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఎ) విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తారియాల్ కొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల ట్రెడిషనల్ 60 కేజీల విభాగంలో సుచికా కాంస్య పతకం సాధించి ఎంఎంఏ విభాగంలో పతకం అందించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో సుచికా తారియాల్ సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో హోరాహోరీగా తలపడింది. నిర్ణీత, అదనపు సమయంలోనూ ఇరువురు సమాన పాయింట్లతో నిలిచారు. దీంతో నిబంధనల ప్రకారం సుచికా సింగపూర్‌కు చెందిన హుయ్ కంటే 700 గ్రాములు అధిక బరువు ఉన్న కారణంగా ఓడినట్లు ప్రకటిం చారు. దీంతో సుచికా ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. క్వార్టర్‌ఫైనల్లో మంగోలియా కు చెందిన అల్టాన్‌చిమెగ్ బైగల్మాను 2-0తో సుచికా ఓడించచడంతో కాంస్య పతకం ఖాయమైంది. దాంతో ఆసియా గేమ్స్ ఎంఎంఏలో భారత్‌కు పతకం సాధించిన 36 ఏళ్ల సుచికా రికార్డు సృష్టించింది.








కామెంట్‌లు (0)