సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

19న భారత్‌ ‌× పాకిస్తాన్‌ ఢీ

1 గంట క్రితం

hockey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 11:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ విడుదల

బ్రూసెల్స్‌(‌బెల్జియం): ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచ కప్‌ ‌‌టోర్నమెంట్‌ ఈనెల 15నుంచి బెల్జియం వేదికగా జరగనుంది. ఈ టైటిల్‌‌ను రెండోసారి కైవసం చేసుకొని 51 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలనే భారత్ హాకీ జట్టు భావిస్తోంది. 15న వేల్స్‌తో జరిగే తొలి గ్రూప్‌ ‌మ్యాచ్‌తో భారతజట్టు టోర్నమెంట్‌‌లో ‌తన పోరాటాన్ని ప్రారంభించనుంది. ఈసారి జరిగే ఎఫ్‌ఐహెచ్‌ ‌ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ జర్మనీ, బెల్జియం వేదికలుగా జరగనుంది. డిఫెండింగ్‌ ‌ఛాంపియన్‌ ‌జర్మనీ, బెల్జియం జట్లు ఒకే గ్రూప్‌ (పూల్‌-‌బి)లో చోటు ‌దక్కించుకోగా.. భారతజట్టుకు పూల్‌-‌డిలో ఉంది. ఈ పూల్‌‌లో ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, వేల్స్‌ ‌జట్లు ఉన్నాయి. మొత్తం 16జట్ల మధ్య జరిగే ఈ మెగా సంగ్రామంలో భారతజట్టు తన తొలి గ్రూప్‌ ‌లీగ్‌ ‌మ్యాచ్‌‌ను 15న వేల్స్‌‌తో ప్రారంభించనుంది. బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్ టైటిల్‌ ‌ఫేవరెట్‌ ‌జట్లు. 15 నుండి 30 వరకు ఆమ్‌స్టల్‌వీన్ మరియు వావ్రే వేదికలుగా జరిగే ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచ కప్ 2026 మెగా టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌‌ను ఎఫ్‌ఐహెచ్‌ ‌నిర్వాహకులు సోమవారం విడుదల చేశారు.

గ్రూపులు...

పూల్‌-ఎ: నెదర్లాండ్‌, అర్జెంటీనా, న్యూజిలాండ్‌, జపాన్‌.

పూల్‌-‌బి: బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, మలేషియా

పూల్‌-‌సి: ఆస్ట్రేలియా, స్పెయిన్‌, ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా

పూల్‌-‌డి: ఇండియా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, వేల్స్‌

ఆగస్టు 15(శని) : ఇండియా × వేల్స్‌17(సోమ): ఇండియా × ఇంగ్లండ్‌

19(బుధ) : ఇండియా × పాకిస్తాన్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్