సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళల క్రికెట్‌లో స్వర్ణ పతకానికి భారత్‌, శ్రీలంక ఢీ

1 గంట క్రితం

team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఐచి-నగోయా(జపాన్‌): ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు మంగళవారం జరిగే ఫైనల్లో శ్రీలంకను ఓడిస్తే మరోసారి స్వర్ణ పతకం చేజిక్కించుకోనుంది. ఈ మ్యాచ్‌ జపాన్‌లోని నిషిన్‌ కోరోగీ స్పోర్ట్స్ పార్క్‌లో జరగనుంది. క్వార్టర్‌ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారతజట్టులో ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌పై షెఫాలీ కేవలం 49 బంతుల్లోనే 100 పరుగులు చేసి రికార్డు సెంచరీతో మెరిసింది. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 195/4 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్‌ను 81 పరుగులకే ఆలౌట్ చేసి 114 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత జట్టు తరఫున ఫామ్‌లో ఉన్న షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్, ఆల్ రౌండర్ దీప్తి శర్మ మ్యాచ్ విన్నర్లుగా మారనుండగా.. శ్రీలంక జట్టు పూర్తిగా వారి స్టార్ కెప్టెన్ చమరి అతపత్తుపై ఆధారపడి ఉంది. ముఖాముఖి పోరులోనూ భారత్‌దే అగ్ర స్థానం. ఇప్పటివరకు మొత్తం 32 మ్యాచులు జరగ్గా.. భారత్‌ 26, శ్రీలంక 5మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌ రద్దయ్యింది. ఇప్పుడు ఆసియా గేమ్స్ ఫైనల్లోనూ ఈ రెండు జట్లు తలపడనున్నాయి. 2022 హ్యాంగ్‌జౌ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకున్న టీమిండియా, ఈసారి కూడా టైటిల్‌ను కొట్టాలని చూస్తోంది. ఇక భారత్‌, శ్రీలంక మహిళలజట్లు ఆసియా కప్ ఫైనల్లో తలపపడ్డాయి. బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా.. ఛేదనలో శ్రీలంకను కేవలం 111 పరుగులకే ఆలౌట్‌ చేసి 72పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తెలుగు తేజం, కడపకు చెందిన శ్రీచరణి(4/20) కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌లో చెలరేగి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించింది.

జట్లు(అంచనా)...

భారత మహిళలు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), మంధాన, షెఫాలీ వర్మ, కమిలిని, రీచా ఘోష్‌(వికెట్‌ కీపర్‌), ఫుల్మాలీ, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్‌, శ్రీచరణి, నందిని శర్మ, క్రాంతి గాడ్‌. శ్రీలంక మహిళలు: ఆటపట్టు(కెప్టెన్), దిలానీ, హాసిని, హర్షిత, సమరవిక్రమ, దిల్హారీ, కరుణరత్నే, కౌషని(వికెట్‌ కీపర్‌), మిథాలీ, కవింది, చాముండి.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్