ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యునిసెఫ్‌ సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధన

11 గంటల క్రితం

Smriti Mandhana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 05:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఇటీవల భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్మృతి మంధన యునిసెఫ్‌ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం యునిసెఫ్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. బాలికల హక్కులు, భద్రత, ఆరోగ్యం, సమాన అవకాశాలపై అవగాహన కల్పించడంలో స్మృతి కీలక పాత్ర పోషించనున్నారు. బాలికలు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించి, తమ లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించేందుకు యునిసెఫ్‌ చేపట్టే కార్యక్రమాలకు ఆమె మద్దతుగా నిలవనున్నారు. ఈ బాధ్యత లభించడం గౌరవంగా భావిస్తున్నానని స్మృతి మంధన తెలిపారు. ప్రతి చిన్నారికి పెద్ద కలలు కనడంతోపాటు వాటిని సాకారం చేసుకునే అవకాశం ఉండాలని ఆకాంక్షించారు. గతంలోనూ బాలికల సమానత్వం, పిల్లల హక్కులపై యునిసెఫ్‌ నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. యునిసెఫ్‌ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ మాట్లాడుతూ.. స్మృతి ప్రయాణం బాలికలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తే అద్భుతాలు సాధించవచ్చని ఆమె విజయాలు నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్