రికార్డుల్లో శ్రీచరణి
ఏడు పరుగులకే మూడు వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ మహిళలతో శనివారం జరిగిన మ్యాచ్‌లో మహిళల ఆసియాకప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తెలుగమ్మాయి శ్రీచరణి రికార్డు బౌలింగ్‌తో రాణించింది. కేవలం 7 పరుగులకే 3వికెట్లు పడగొట్టి కెరీర్ బెస్ట్, ఆసియాకప్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌తో మెరిసింది. శ్రీచరణి(3/7)కి తోడు, ప్రేమ రావత్(3/9)కూడా రాణించడంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ మహిళలు 18.1ఓవర్లలో కేవలం 55పరుగులకు ఆలౌటయ్యారు. టి20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ మహిళలకు ఇదే అత్యల్ప స్కోరు. ఆ లక్ష్యాన్ని భారత మహిళలు 8.4ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. షెఫాలీ వర్మ(12), మంధాన(9), ప్రతికా రావల్(4) నిరాశపరిచినా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్(18), దీప్తి శర్మ(12) మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ గెలుపుతో గ్రూప్-ఎలో భారత మహిళలజట్టు 6పాయింట్లతో టాప్‌లో నిలిచి మహిళల ఆసియాకప్ సెమీస్‌కు చేరింది. అంతకుముందు టాస్ గెలిచి తొలి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు మునీబా అలీ, షావాల్ జుల్ఫీకర్ తొలి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత షఫాలీ వర్మ బ్రేక్ త్రూ అందించడంతో పాక్ బ్యాటింగ్ కుప్పకూలింది. శ్రీచరణి స్టంప్స్ టూ స్టంప్స్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. పాకిస్తాన్ ఓపెనర్లు మునీబా(13), జుల్‌ఫికర్(14) శుభారంభం అందించినా.. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. దీంతో ఆ జట్టు 55 పరుగులకే కుప్పకూలింది. శ్రీచరణి, ప్రేమా రావల్ మూడేసి వికెట్లకు తోడు, దీప్తి శర్మ రెండు, షెఫాలీ వర్మ ఒక వికెట్‌తో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ శ్రీచరణికి లభించింది.
శ్రీచరణి కెరీర్ బెస్ట్ బౌలింగ్
ఆసియాకప్ టోర్నీ చరిత్రలో భారత స్పిన్నర్ శ్రీ చరణి (3/7) అత్యుత్తమ గణాంకాలతో రికార్డుల్లోకెక్కింది. భారత్ తరఫున అత్యుత్తమ ఎకానమీ బౌలింగ్ (4 ఓవర్ల కోటాలో) దీప్తి శర్మ (2022లో థాయ్‌లాండ్‌పై 3/7) సరసన నిలిచింది. అలాగే భారత మహిళల టీ20 చరిత్రలోనూ ఇది సంయుక్తంగా అత్యుత్తమ పొదుపైన స్పెల్స్‌లో ఒకటిగా నమోదైంది.
స్కోర్‌బోర్డు...
పాకిస్తాన్ మహిళలు: మునీబా అలీ (బి)షెఫాలీ వర్మ 13, జుల్‌ఫికర్ (ఎల్‌బి)శ్రీచరణి 14, ఫెరోజా (సి)నందిని (బి)శ్రీచరణి 0, అయేషా (సి)హర్మన్‌ప్రీత్ (బి)శ్రీచరణి 2, షాదాబ్ షమాస్ (బి)ప్రేమా రావత్ 3, ఫాతిమా సనా (ఎల్‌బి)దీప్తి శర్మ 0, ఇమన్ ఫాతిమా (రనౌట్)ఫుల్మాలీ/దీప్తి 5, ఉమ్-ఇ-హని (సి)నందిని (బి)ప్రేమ రావత్ 6, తుబా హసన్ (స్టంప్)రీచా (బి)దీప్తి 9, నస్రా సంధు (సి)రీచా (బి)ప్రేమ రావత్ 0, సదియా ఇక్బాల్ (నాటౌట్) 0, అదనం 3. (18.1ఓవర్లలో ఆలౌట్) 55 పరుగులు. వికెట్ల పతనం: 1/27, 2/28, 3/29, 4/32, 5/35, 6/35, 7/45, 8/48, 9/54, 10/55 బౌలింగ్: క్రాంతి గాడ్ 2-0-9-0, నందిని శర్మ 2-0-14-0, షెఫాలీ వర్మ 3-0-10-1, శ్రీచరణి 4-0-7-3, దీప్తి శర్మ 3.1-0-5-2, ప్రేమ రావత్ 4-0-9-3.
ఇండియా మహిళల ఇన్నింగ్స్: షెఫాలీ వర్మ (సి అండ్ బి)ఫాతిమా సనా 12, మంధాన (ఎల్‌బి)ఫాతిమా సనా 9, ప్రతికా రావల్ (సి)మునీబా (బి)ఫాతిమా సనా 4, హర్మన్‌ప్రీత్ కౌర్ (నాటౌట్) 18, దీప్తి శర్మ (నాటౌట్) 12, అదనం 2. (8.4ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 57పరుగులు. వికెట్ల పతనం: 1/13, 2/19, 3/29 బౌలింగ్: సదియా ఇక్బాల్ 3-0-16-0, ఫాతిమా సనా 3-0-17-3, నస్రా సంధు 1.4-0-19-0, ఉమ్-ఇ-హని 1-0-4-0.








కామెంట్‌లు (0)