మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​శ్రేయస్‌ శతకం

2 గంటల క్రితం

team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 01:17 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- తొలి టి20 విండీస్‌పై టీమిండియా ఘన విజయం

లక్నో: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో భారత్‌ ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(102) అజేయ శతకానికి తోడు ఇషాన్‌ కిషన్‌(37) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో వెస్టిండీస్‌ నిర్దేశించిన 172 పరుగుల భారీ ఛేదనను టీమిండియా కేవలం 14.4ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వీరిద్దరు 3వ వికెట్‌కు 137పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ముగించారు. ఓపెనర్లు సంజు శాంసన్‌ (11), అభిషేక్‌ శర్మ (21) త్వరగా ఔటై నిరాశపరిచినా.. మరో వికెట్‌ పడకుండా వీరిద్దరూ మ్యాచ్‌ను ముగించడం విశేషం. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(102నాటౌట్‌; 43బంతుల్లో 10ఫోర్లు, 6సిక్సర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు లభించగా.. లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం జరిగిన తొలి టి20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 19.1 ఓవర్లలో 171 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్, విధ్వంసకర బ్యాటర్ షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ అర్ధ సెంచరీలతో రాణించారు. తొలుత ఇన్నింగ్స్ ఆరంభంలో విండీస్ కాస్త తడబడింది. పవర్‌ప్లే ముగిసేసరికి 44 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ షాయ్ హోప్ (37 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. అయితే, హోప్ ఔటైన తర్వాత విండీస్ ఇన్నింగ్స్ మళ్లీ గాడితప్పింది. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అరంగేట్రం ఆటగాడు నమన్ ధీర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లతో విండీస్ మిడిలార్డర్‌ను దెబ్బతీశారు. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రెండో టి20 శుక్రవారం జరగనుంది.

​స్కోర్‌బోర్డు...

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: హోప్‌ (సి)అక్ష‍ర్‌ (బి)నమన్‌ ధీర్‌ 52, పూరన్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 12, హెట్‌మైర్‌ (రనౌట్‌)శ్రేయస్‌/సంజు 5, పోవెల్‌ (బి)అక్ష‍ర్‌ పటేల్‌ 0, రూథర్డ్‌ఫోర్డు (సి)నమన్‌ ధీర్‌ (బి)మయాంక్‌ యాదవ్‌ 56, ఛేస్‌ (ఎల్‌బి)కుల్దీప్‌ 5, షెఫర్డ్‌ (సి)తిలక్‌ వర్మ (బి)నమన్‌ ధీర్‌ 7, ఫోర్డే (సి)ఇషాన్‌ కిషన్‌ (బి)కుల్దీప్‌ 2, స్ర్పింగర్‌ (సి)అక్ష‍ర్‌ (బి)నమన్‌ ధీర్‌ 9, హొసైన్‌ (సి)ఇషాన్‌ (బి)అక్ష‍ర్‌ 15, జోసెఫ్‌ (నాటౌట్‌) 0, అదనం 8. (19.1ఓవర్లలో ఆలౌట్‌) 171పరుగులు. వికెట్ల పతనం: 1/38, 2/44, 3/44, 4,/107, 5/114, 6/121, 7/124, 8135, 9/171, 10/171 బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ 4-0-34-1, మయాంక్‌ యాదవ్‌ 4-0-40-1, అక్ష‍ర్‌ పటేల్‌ 3.1-1-26-2, కుల్దీప్‌ 4-0-33-2, నమన్‌ ధీర్‌ 4-0-31-3.

ఇండియా ఇన్నింగ్స్‌: సంజు శాంసన్‌ (సి అండ్‌ బి)అకెల్‌ హొసైన్‌ 11, అభిషేక్‌ శర్మ (సి)హెట్‌మైర్‌ (బి)రోస్టన్‌ ఛేస్‌ 21, ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 37, శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 102, అదనం 1. (14.4ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 172పరుగులు. వికెట్ల పతనం: 1/29, 2/35 బౌలింగ్‌: ఫోర్డే 2-0-39-0, ఆకెల్‌ హొసైన్‌ 4-0-37-1, ఛేస్‌ 3.4-0-37-1, జోసెఫ్‌ 2-0-23-0, షెఫర్డ్‌ 2-0-24-0, స్ప్రింగర్‌ 1-0-12-0.


భువనేశ్వర్‌ రీఎంట్రీ

న్యూజిలాండ్‌ టి20 సిరీస్‌కు బిసిసిఐ ప్రకటించిన టీమిండియాజట్టులో భువనేశ్వర్‌ కుమార్‌కు చోటు లభించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత భువీ మరోసారి జాతీయ జట్టుకు ఆడనున్నాడు. అలాగే మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఫిట్‌నెట్‌ సాధించి ఎంపికయ్యాడు.

జట్టు: శ్రేయస్(కెప్టెన్), అభిషేక్, సంజూ(వికెట్ కీపర్), సూర్యవంశీ, ఇషాన్, తిలక్ (వైస్ కెప్టెన్), అక్షర్, దూబే, నితీశ్ కుమార్, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్