సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీస్ శిక్షణ పూర్తి చేసుకున్న 473 మంది మహిళ కానిస్టేబుల్

1 గంట క్రితం

anitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 10:32 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం జిల్లా పోలీస్ శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 473 మంది మహిళా కానిస్టేబుల్స్ ఘనంగా పాసింగ్ అవుట్ పెరేడ్. సోమవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్థను పటిష్టగా చేయడానికి పోలీస్ రిక్రూట్మెంట్ ను పట్టడం జరిగిందన్నారు. ఏ రాష్ట్రంలో అయితే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా కఠినంగా ఉంటుందో ఆ రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు 2021 వ సంవత్సరంలో గత ప్రభుత్వం నోటిఫికేషన్ పూర్తి చేయలేదన్నారు. ఈ పోలీస్ రిక్రూట్మెంట్ సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ప్రస్తుతం ఇస్తున్న స్టైఫండ్ 4000 రూపాయలు చాలట్లేదని చెప్పడంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి 12 వేల రూపాయలు చేయడం గొప్ప విషయం అన్నారు ఎప్పటికీ లెర్నింగ్ ముఖ్యమంత్రి అన్నారు ఈ రెండున్నర సంవత్సరాలలో ఎస్పీ దామోదర్ చాలా చొరవ తీసుకున్నారన్నారు ఎంతమంది పోలీస్ అవుట్ పాసింగ్ పెరేడ్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు మీరు విధుల్లోకి వెళ్లేటప్పుడు కుటుంబం సెల్ఫ్ రెస్పెక్ట్ మనోధైర్యంతో ఎంతోమంది మహిళలకు మీరు ఆదర్శనీయమన్నారు మెంటల్ ఎబిలిటీ, శారీరక దారుణ్యం తో 9 నెలల కాలంలో జరిగిన శిక్షణ 30 సంవత్సరాల అనుభవానికి ఉపయోగపడుతుందన్నారు ఈ పోలీస్ వ్యవస్థలో ఏదైనా విధులు నిర్వహించవలసి వచ్చినప్పుడు ధైర్యంగా మేముంటామంటూ ముందుకు సాగాలన్నారు మీ తల్లిదండ్రులు కుటుంబ వ్యవస్థ మీ భార్యాభర్తలు పిల్లలు మీకు అందించిన దైర్య సాహసాలు ఎనలేనిమన్నారు. పోలీస్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుల్ కు స్ఫూర్తిదాయకమైన తన మాటలతో మనోధైర్యాన్ని నింపిన హోం మంత్రి వంగలపూడి అనిత. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసేట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ స్ఫూర్తిని అయితే కలలు కంటున్నారు దాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ప్రజల జీవితాలకు ప్రజా సేవకు మీ జీవితం అంకితం కావాలన్నారు. విజయనగరం శిక్షణ కళాశాల పి టి సి డి ఆర్ సి రాజు మాట్లాడుతూ ఈ తొమ్మిది నెలల కాలంలో శిక్షణ పూర్తి చేసుకున్న తొమ్మిది జిల్లాలకు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుల్ అన్నారు. 1908వ సంవత్సరంలో ఈ శిక్షణ కళాశాల స్థాపించడం జరిగింది అన్నారు ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో శిక్షణను పూర్తి చేసుకున్నాను అన్నారు చట్టపరమైన అవగాహన వ్యక్తిగత భద్రత సైబర్ క్రైమ్ మాదకద్రవ్యాలు ఏఐ ఇటువంటి టెక్నాలజీలతో శిక్షణను ఎంతో క్రమబద్ధతతో పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుల్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఎస్ పి ఏ ఆర్ దామోదర్, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుల్ తల్లిదండ్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్