గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమరావతి రాజధాని కోసం మరో రూ.15 వేల కోట్ల అప్పు

1 గంట క్రితం

Land pooling in Kantheru and Tadikonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 10:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రుణ సంస్థలతో చర్చలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.15 వేల కోట్ల రుణం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రపంచబ్యాంకు, ఎడిబితో సంప్రదింపులు జరుగుతున్నాయి. అలాగే మరికొన్ని సంస్థలతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. రాజధానిలో ఎపిసిఆర్‌‌డిఏ, అమరావతి డెవలప్‌‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎడిసిఎల్‌), అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌(ఎజిఐసిఎల్‌) ఆధ్వర్యంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల టవర్లు, వరద నివారణ పనులు, ట్రంక్ మౌలిక సదుపాయాలు, ల్యాండ్-పూలింగ్ జోన్లలో మౌలిక సదుపాయాలకు సంబంధించి 102 పనులను రూ.రూ.52,362 కోట్లతో చేపట్టింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి), హడ్కో, నాబ్‌ఫిడ్ (ఎన్‌ఏబిఎఫ్‌ఐడి), నాబార్డ్ వంటి సంస్థల నుండి అప్పు రూపంలో తీసుకుంది. ఇవి కాకుండా రెండోదశ వరద నివారణా పనులు, సిగ్నేచర్‌, ఐకానిక్‌ ‌వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 1.6 బిలియన్ అమెరికన్ డాలర్ల అదనపు నిధుల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ ‌డెవలప్‌‌మెంట్ బ్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. వీటికి సంబంధించిన చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. త్వరలోనే ఆమోదం లభించనుంది. అయితే కొత్తగా ఇచ్చే నిధులకు సంబంధించి నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రోగ్రామ్‌ ‌మేనేజ్‌‌మెంట్‌ ‌కన్సల్టెంట్‌‌ను నియమించాలని రుణ దాతలు కోరిన నేపథ్యంలో దాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో సిఆర్‌‌డిఏ ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్