ప్రజాశక్తి-గుంటూరు : రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురై కిమ్స్ శిఖర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నర్సరావుపేటకు చెందిన సయ్యద్ ఇబ్రహీం ఖలీల్(38)కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించటంతో వివిధ హాస్పిటల్స్‌కు అవయవాలను అందచేశారు. సయ్యద్ ఖలీల్ గత శుక్రవారం రోడ్డు దాటుతున్న సమయంలో ద్విచక్రవాహనం ఢీకొన్నది. వైద్యం కోసం అతనిని కుటుంబ సభ్యులు కిమ్స్ శిఖరలో చేర్చారు. చికిత్సకు సహకరించకపోవటంతో వైద్యులు అవయవదానం గురించి వివరించారు. ఆప్నియా టెస్ట్ ద్వారా బ్రెయిన్ డెడ్‌గా నిర్దారించారు. జీవన్‌ధాన్ చైర్మన్ డాక్టర్ మన్మధరావు అవయవదానం ప్రాధాన్యత గురించి ఖలీల్ కుటుంబ సభ్యులకు వివరించారు. అవయవ దానం చేయటం ద్వారా ప్రాణాపాయంలో ఉన్న కొంత మందికి జీవించే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో వారు అంగీకరించటంతో ఊపిరితిత్తులను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు, గుండెను తిరుపతిలోని పద్మావతి హాస్పిటల్‌కు, కాలేయం, ఒక కిడ్నీని కిమ్స్ శిఖరకు, మరొక కిడ్నీని ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌కు తరలించారు.
బ్రెయిడెడ్ అయిన ఖలీల్ అవయవాలు దానం
39 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 10:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)