ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విమానాశ్రయ బాధితుల గోడు వినిపించదా?

16 గంటల క్రితం

విమానాశ్రయ బాధితుల గోడు వినిపించదా?
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
- గన్నవరంలో బాధితుల దీక్షలకు మద్దతు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 08:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

- గన్నవరంలో బాధితుల దీక్షలకు మద్దతు

ప్రజాశక్తి - గన్నవరం : ​‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు 13 ఏళ్లుగా పరిహారం కోసం నిరీక్షిస్తున్న గన్నవరం విమానాశ్రయ బాధితుల గోడు వినిపించకపోవడం శోచనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ, ఏలూరు కాల్వ మళ్లింపు పనుల కోసం నివాసాలు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం తహశీల్దారు కార్యాలయం వద్ద బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ... నాటి టిడిపి ప్రభుత్వం దావాజీగూడెంలోని 423 పేద కుటుంబాల నివాసాలను, అల్లాపురం పంచాయతీ పరిధిలోని 552 మంది మధ్యతరగతి ప్రజల నుండి నివేశనా స్థలాలను బలవంతంగా లాగేసుకుందని వివరించారు. ​13 ఏళ్ల క్రితం రూ.తొమ్మిది లక్షలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం... ఇప్పుడు రూ.4.5 లక్షల చొప్పున రెండు విడతలుగా ఇస్తామని బేరాలకు దిగడం దర్మార్గమన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న టిడిపి కూటమి ప్రభుత్వానికి, సర్వస్వాన్ని త్యాగం చేసిన బాధితులకు రూ.100 కోట్ల పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. గన్నవరం విమానాశ్రయ బాధితులకు ఆనాటి నుంచి ఇప్పటి వరకూ వడ్డీతో కలిపి పరిహారం చెల్లించాలని, ఇళ్లును కూలదోయడంతో రోడ్డున పడ్డ ప్రతి కుటుంబానికీ పూర్తిస్థాయిలో ఇల్లు కట్టేంతవరకు పూర్తిగా అద్దె ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. పునరావాస ప్యాకేజీలో ఆడపిల్లలకు హక్కు లేదనడం ప్రభుత్వాల వివక్షకు పరాకాష్ట అన్నారు. బాధితులంగా ఐక్యంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చే వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. యుటిఎఫ్ జిల్లా కోశాధికారి ఎం.వరప్రసాద్ సాయంత్రం నిమ్మరసం అందించి దీక్షలను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గన్నవరం మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.పవన్ కుమార్‌ ‌తోపాటు బాధితులు పాల్గొన్నారు.

విఆర్‌ఎల సమ్మెకు మద్దతు

రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా గన్నవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు చేపట్టిన సమ్మె శనివారానికి 18వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మె శిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సందర్శించి మద్దతు తెలిపారు. విఆర్‌ఎల పోరాటానికి అండగా ఉంటామన్నారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్