శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసి జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి...

2 గంటల క్రితం

సిఇసి జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి
- ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 10:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ​: సిఇసి జ్ఞానేష్ కుమార్.. బిజెపి కార్యకర్త, మోడీ ఏజెంట్ అని, వెంటనే ఆయనను తొలగించాలని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్‌ ‌షర్మిల డిమాండ్‌ ‌చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవిత్రమైన ఓటును బిజెపి చోరీ చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి అవసరం పడితే దొంగ ఓట్లు సృష్టిస్తారని, లేదనుకుంటే ఓట్ల తొలగింపు చేస్తారని విమర్శించారు. ⁠ప్రతి రాష్ట్రంలో ఇష్టానుసారం ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ⁠ఇప్పటి వరకు 13 కోట్ల ఓట్లను తొలగించారని తెలిపారు. స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘాన్ని మోడీ భ్రష్టు పట్టించి తన గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపించారు.⁠ ఏడాది కాలంలోనే 14 సార్లు జ్ఞానేష్‌‌కుమార్‌ మిగతా కమిషనర్లకు తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. దేశంలోని ప్రతి పౌరుడు జ్ఞానేష్ చర్యలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. సిఇసి జ్ఞానేష్ కుమార్ ఓట్ చోరీ చేసినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌మస్తాన్‌ ‌వలీ, పట్టణ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్