శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మక్కువను వదలని ఏనుగులు

2 గంటల క్రితం

ele
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- పలుచోట్ల మొక్కజొన్న వరి పంటలకు నష్టం

- ఆందోళన చెందుతున్న రైతులు

ప్రజాశక్తి-మక్కువ: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని గత ఐదు రోజులుగా ఏనుగులు గుంపు ప్రవేశించి ఇంకా తిష్ట వేసి ఉన్నాయి. ఇప్పటికే ఏనుగులు వలన పలు గ్రామాల రైతులకు నష్టం వాటిలతోనే ఉంది. మొక్కజొన్న వరి పంటలను ఏనుగులు నాశనం చేస్తూ వస్తున్నాయి. కొత్త లవర్ కండి దబ్బగడ్డ ఎన్ .దబ్బగడ్డ కే పెద్దవలస ఎర్ర సామంత వలస బొడ్డు సామంత వలస గ్రామాలలో పలువురు రైతులు ఏనుగుల బారిన పది పంటలను నష్టపోయారు. శనివారం ఉదయం వేరాడువలస ఎస్ పెద్దవలస పరిసరాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అరటి పంట కూడా ఉండడంతో రైతులు కలవరం చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తూ ఏనుగులు కదలికలను ట్రాకర్స్ అనుసరిస్తూ వస్తున్నారు. నీటి వనరులు పుష్కలంగా ఈ ప్రాంతంలో ఉండడంతో ఏనుగులు కదలటం లేదని స్థానికులు అంటున్నారు. ఏ గ్రామాల్లో ఎంత మేరకు పంటలు నష్టాలు జరిగాయి అన్న విషయాన్ని కూడా అధికారులు ఇప్పటికీ వివరాలు వెళ్లడంచ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కుంకీ ఏనుగుల ద్వారా అటవీ ప్రాంతం వైపు ఏనుగులను మళ్లించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్