సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాడేరు ఘాట్‌లో ఘోర ప్రమాదం

51 నిమిషాల క్రితం

పాడేరు ఘాట్‌లో ఘోర ప్రమాదం 
- యాత్రికుల వాహనం బోల్తాపడి ఇద్దరు భవానీలు మృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 11:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- యాత్రికుల వాహనం బోల్తాపడి ఇద్దరు భవానీలు మృతి

ప్రజాశక్తి - పాడేరు, మాడుగుల: శరన్నవరాత్రి వేడుకల్లో విషాదం అలముకుంది. వ్యాను బోల్తా పడి ఇద్దరు భవనీ మాలధారులు మృతి చెందారు. 22 మంది గాయపడ్డారు. ఈ ఘటన అల్లూరి జిల్లా పాడేరు ఘాట్‌ ‌రోడ్డులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు... అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన 24 మంది భవానీమాల ధరించారు. వారు సోమవారం పాడేరులోని మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని మధ్యాహ్నం తిరుగు పయనమయ్యారు. ఘాట్‌ ‌రోడ్డులోని కోమలమ్మ పణుకు సమీపంలో వ్యాన్‌ బ్రేకులు ఫెయిలయ్యాయి. వాహనం బండరాయిని ఢీకొని బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని అనకాపల్లి జిల్లా మాడుగుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో వేమాల పూజత (17), ముసుడుపల్లి ముసిలినాయుడు (52)కి పరిస్థితి విషమించి మృతి చెందారు. మాడుగుల ఎస్ఐ నారాయణరావు, సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో ఆర్ రాజారావు, ఎం పవిత్ర, ఎం పద్మ, వి ద్వారక, తనూజ, ఎం పావని, కె కావ్య శ్రీ, ఆర్ ప్రసన్న, పరదేశమ్మ, ఎం రేష్మ, ఎం యమున, ఎం కావ్యశ్రీ, పి ప్రసన్న, కె వంశీ, కె ధరణి, ఆర్ ప్రసాద్, తరుణ్, ఎం జయ, సుందర్ తదితరులు ఉన్నారు.

​

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్