బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి

53 నిమిషాల క్రితం

ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి
-జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బ్యాంకు ఉద్యోగుల ధర్నా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 12:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​- జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బ్యాంకు ఉద్యోగుల ధర్నా

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : బ్యాంకులలో ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని కోరుతూ బుధవారం విశాఖ నగరంలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బ్యాంకు ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ వి.ఉదయకుమార్ మాట్లాడుతూ ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులకు మూలస్థంభం అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వారంలో ఐదు రోజులే పనిచేస్తోందని గుర్తు చేశారు. ప్రస్తుత పని ఒత్తిడి వల్ల బ్యాంకు ఉద్యోగులు పని, జీవన విధానం ఇబ్బందికరంగా ఉందని ఐబిఎ ఒప్పుకుని సిఫార్సు చేసినప్పటికీ, ఐదు రోజుల పని విధానానికి ప్రభుత్వం నేటికీ స్పందించకపోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక్క రోజు ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 28, 29, 30 తేదీలలో సమ్మె చేస్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందన లేకపోతే అక్టోబర్ 26 నుండి నిరవధిక దేశవ్యాప్త సమ్మెకు వెనుకాడబోమన్నారు. కార్యక్రమంలో యుఎఫ్‌బియు కన్వీనర్ ఆర్.వసంతరావు, వివిధ జిల్లాల ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్