శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పుష్కరాల పనులకు ముందస్తు అనుమతి ఇవ్వండి

26 సెప్టెంబర్, 2026

పుష్కరాల పనులకు ముందస్తు అనుమతి ఇవ్వండి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యానాం : ​2027 జూన్‌లో జరగనున్న యానాం గోదావరి పుష్కరాలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ముందస్తు అనుమతులు మంజూరు చేసి, ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌. రంగసామి, మంత్రి మల్లాడి కృష్ణారావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రికి వినతిపత్రం అందజేశారు. పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు కేవలం తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉందని వారు వివరించారు. పనులకు సంబంధించిన అవసరమైన ప్రక్రియలను ఇప్పటికే పూర్తి చేశామని, కేంద్రం నుంచి ముందస్తు అనుమతులు,ప్రత్యేక నిధులు మంజూరైతే పనులను వేగవంతంగా చేపట్టి భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్