శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉపాధి కార్మికులకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి

2 గంటల క్రితం

ఉపాధి కార్మికులకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి
​- వ్యకాసం రాష్ట్ర అధ్యక్షురాలు రమాదేవి డిమాండ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 09:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​- వ్యకాసం రాష్ట్ర అధ్యక్షురాలు రమాదేవి డిమాండ్

ప్రజాశక్తి - ​విజయవాడ రూరల్ : ఫేస్ యాప్‌ను రద్దు చేయాలని, కార్మికులకు 200 రోజులు ఉపాధి పని కల్పించాలని, కనీస వేతనం రూ.600 ఇవ్వాలని, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి.రమాదేవి డిమాండ్ చేశారు. ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా విజయవాడ రూరల్‌ ‌మండలం పి.నైనవరం గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద శనివారం ఉపాధి కార్మికులు నిరసన కార్యక్రమం ‌నిర్వహించారు. కార్మికుల నిరసనలో రమాదేవి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని ఒకేసారి రద్దుచేస్తే ప్రజలు తిరగబడతారని పొమ్మనకుండా పొగ పెట్టినట్లు ఉపాధి పనులు కల్పించకుండా కొత్త పద్ధతుల్లో తీవ్ర నష్టం కలిగిస్తోందని విమర్శించారు. కొత్తగా పెట్టిన ఫేస్ యాప్ వల్ల పని ప్రదేశాల్లో హాజరు పడక రాష్ట్రంలో లక్షల మంది ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని, పెండింగ్ వేతనాలు, పే స్లిప్స్, పనిముట్లు, ప్రమాదంలో చనిపోతే రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే రూ.రెండు లక్షల కోట్లు కరువు ప్యాకేజీ కేటాయించి ఉపాధి హామీని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఎన్‌‌టిఆర్ జిల్లా కార్యదర్శి కోట కల్యాణ్, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి మాతంగి ఆంజనేయులు, పిఎన్‌ఎం జిల్లా అధ్యక్షులు జి.వి.రంగారెడ్డి పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్