శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈనెల 4 నుంచి నీట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభం

7 గంటల క్రితం

council
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 09:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉప కులపతి పులాల చంద్రశేఖర్

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నీట్ యూజీ 2026 ప్రవేశాలకు అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉప కులపతి పులాల చంద్రశేఖర్ తెలిపారు.తొలి విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి17వ తేదీ వరకు నిర్వహించనున్నారన్నారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన తేదీలను గమనించి, నిర్దేశిత గడువులో అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

​అఖిల భారత కోటాలో చేరిన అభ్యర్థుల వివరాల ధృవీక రణ ఆగస్టు 23న జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 13 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనుండగా, చేరిన అభ్యర్థుల వివరాల రాష్ట్రస్థాయి ధృవీకరణ ఆగస్టు 29న నిర్వహించనున్నారని పేర్కొన్నారు.తొలి విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌లో చేరేందుకు ఈనెల 22 చివరి తేదీ కాగా, రాష్ట్ర కౌన్సెలింగ్‌కు సంబంధించి చేరికకు ఈనెల28, చివరి తేదీగా నిర్ణయించారని తెలిపారు.రెండో విడత కౌన్సెలింగ్ అఖిల భారత కోటాలో ఈనెల24 నుంచి సెప్టెంబర్ 2 వరకు, రాష్ట్ర కోటాలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించనున్నారన్నారని పేర్కొన్నారు. రెండో విడతలో చేరేందుకు అఖిల భారత కోటాలో సెప్టెంబర్ 8, రాష్ట్ర కోటాలో సెప్టెంబర్ 14 చివరి తేదీలుగా నిర్ణయించారని తెలిపారు. మూడో విడత కౌన్సెలింగ్ అఖిల భారత కోటాలో సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు, రాష్ట్ర కోటాలో సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు నిర్వహించనున్నారన్నారని పేర్కొన్నారు. మూడో విడతలో చేరేందుకు అఖిల భారత కోటాలో సెప్టెంబర్ 26, రాష్ట్ర కోటాలో అక్టోబర్ 1 చివరి తేదీలుగా నిర్ణయించారని తెలిపారు.

స్ట్రే వేకెన్సీ రౌండ్ అఖిల భారత కోటాలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు, రాష్ట్ర కోటాలో అక్టోబర్ 3 నుంచి 5 వరకు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఈ రౌండ్‌లో కేటాయించిన అభ్యర్థులు అక్టోబర్ 10లోగా చేరాల్సి ఉంటుందని తెలిపారు. నీట్ - యూజీ 2026 ద్వారా యూజీ కోర్సుల్లో సెప్టెంబర్ 8 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభంకానుందని పేర్కొన్నారు.

​కౌన్సెలింగ్ ప్రక్రియకు సమయం పరిమితంగా ఉన్నాయని, షెడ్యూల్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్నీ శని, ఆదివారాలు, గెజిటెడ్ సెలవు పని దినాలుగా పరిగణించాలని సంబంధిత వైద్య కళాశాలలు, సంస్థలకు సూచించామని తెలిపారు. విద్యార్థులు కౌన్సెలింగ్‌కు సంబంధించిన ప్రతి దశలోనూ నిర్దేశిత తేదీలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్