సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతిలో ప్రైవేట్‌ డిస్కం వద్దు

56 నిమిషాల క్రితం

amaravati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రభుత్వానికి విద్యుత్‌ ఉద్యోగుల జెఎసి వినతి

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి నగరంలో ప్రత్యేక విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, విద్యుత్ పంపిణీ మరియు రిటైల్ సరఫరాను నిర్వహించేందుకు సిఆర్‌‌డిఎ జారీ చేసిన ఎక్స్‌‌ప్రెషన్ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌(ఇఓఐ)ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (ఎపిఎస్‌‌పిఇ జెఎసి) డిమాండ్‌ ‌చేసింది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌‌ను జెఎసి చైర్మన్‌ ‌విఎస్‌ఆర్‌‌కె గణపతి, కన్వీనర్‌ ఎంవి రాఘవరెడ్డి సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల పరిధిలో కొనసాగుతున్న పంపిణీ వ్యవస్థకు సమాంతరంగా, ప్రత్యామ్నాయంగా ప్రత్యేక విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేట్‌ ‌భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం ప్రజల, వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థిరత్వం, ప్రజా ఆస్తుల రక్షణ పై సమగ్ర పరిశీలన లేకుండా ముందుకు తీసుకెళ్లకూడదని తెలిపారు. విద్యుత్ పంపిణీ అత్యంత కీలకమైన ప్రజా సేవ అని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటికే నెట్‌వర్క్‌లు, సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, మీటరింగ్ వ్యవస్థలు, వినియోగదారుల సేవా వ్యవస్థలు, అనుభవజ్ఞులైన సాంకేతిక సిబ్బందితో విస్తృత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశాయని వివరించారు.ఇలాంటి పరిస్థితిలో మరో ప్రత్యేక పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, మీటరింగ్, బిల్లింగ్, ఆపరేషన్ మెయింటెనెన్స్, వినియోగదారుల సేవలు,ఇతర మౌలిక సదుపాయాలలో ద్వంద్వ వ్యవస్థలు వల్ల అనవసరమైన అదనపు వ్యయం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు బదులు ప్రస్తుత విద్యుత్ సంస్థలకు తగిన పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, విధానపరమైన మద్దతు అందించి అమరావతిని మోడల్‌ ‌స్మార్ట్‌ ‌పవర్‌ ‌డిస్ర్టిబ్యూషన్‌ ‌సిటీగా అభివృద్ధి చేయాలని సూచించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్