ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్-2026 అక్టోబర్ 3 విజయవాడలో జరగనుంది. పాన్ ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. విద్య శాఖమంత్రి నారా లోకేష్ కూడా సదస్సులో పాల్గొననున్నారు.దేశంలోని వివిధ ఐఐటీల డైరెక్టర్లు,అధ్యాపకులు, పరిశ్రమల ప్రముఖులు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ ప్రతినిధులు,టెక్నాలజీ నిపుణులు ఈ సదస్సులో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌లో బలమైన, అంతర్జాతీయ స్థాయి డీప్‌టెక్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ నిర్మాణంపై చర్చిస్తారని పౌరసంబంధాల శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎపిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), డీప్‌టెక్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ తదితర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమ్మిట్ జరగనుందని తెలిపింది. ఆంధ్రస్ డిప్‌టెక్ డిసిడ్,యాంకరడ్‌బై పాన్‌ఐఐటీ-స్వర్ణాంధ్ర టు వికసిత భారత్-2047 అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సు జరగనుందని పేర్కొంది.
అక్టోబర్ 3న పాన్‌ఐఐటీ ఎపి సమ్మిట్-2026
12 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 11:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)