- టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ వైసిపి చేస్తున్న డిమాండ్ రాజకీయ దృష్టిమళ్లింపు ఎత్తుగడ అని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. క్షేత్రస్థాయిలో గొడవలు సృష్టిస్తూ, మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రచారం చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో వైసిపి వ్యవహరించిన తీరును ప్రజలు గుర్తుంచుకున్నారని తెలిపారు. ప్రస్తుతం కూడా క్షేత్రస్థాయిలో వివాదాలు సృష్టిస్తూ, మరోవైపు రాష్ట్రపతి పాలన కోరడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్రిక్తతలను పెంచి, ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నాలను సహించబోమని తెలిపారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు గత పాలనలో తమ వ్యవహారశైలిపై వైసిపి ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.







కామెంట్లు (0)