శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిజెపి, ఆర్ఎస్ఎస్ భావజాలమే దేశానికి అసలైన ముప్పు

16 ఆగస్టు, 2026

sharmila
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 10:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపిసిసి ఛీఫ్‌ వైఎస్ షర్మిల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నక్సల్స్‌ కంటే బిజెపి, ఆర్ఎస్ఎస్ వేర్పాటువాద భావజాలమే దేశానికి అసలైన ముప్పు అని ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా విమర్శించారు. ఈ భావజాలం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ నిస్పృహకు ప్రతిబింబంగా, నిరాశ–నిస్సహాయతకు బ్రాండ్ అంబాసిడర్‌గా మోడీ మారారని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగంలో ప్రతిపక్షాలపై వ్యక్తమైన అసహనం ఇందుకు నిదర్శనమని తెలిపారు. స్వాతంత్ర్య వేడుకల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలను వివరించడానికి ఏ అంశం లేకే ప్రధాని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారని ఆరోపించారు. ఇది ఆయన భయం, అభద్రతకు అద్దం పడుతోందన్నారు. గతంలో ‘అర్బన్ నక్సల్స్‌’ అని, ఇప్పుడు ‘దిమాగి నక్సల్స్‌’ అంటూ ప్రశ్నించే ప్రతిపక్షాలను అవమానించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రభుత్వ విధానాలపై పెరుగుతున్న అసమ్మతిని అణచివేయడం, భావప్రకటన స్వేచ్ఛను నియంత్రించడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను భయపెట్టడం ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమని ఆరోపించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ తీవ్రవాదాన్ని వ్యతిరేకించే దిమాగి నక్సల్‌గా తాను గర్వపడుతున్నానని షర్మిల పేర్కొన్నారు. విశాల భారతదేశంలో అశాంతి, అరాచకాలకు, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలనే ప్రయత్నాలకు, కులాలు, మతాల మధ్య విభజన, ఘర్షణలకు బిజెపినే కారణమని షర్మిల ఆరోపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్